అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే

ఆరాధింతును నిన్నే

ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)

ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్

1.ఆశ్చర్యకరుడా స్తోత్రం

ఆలోచనకర్త స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి

సమాధాన అధిపతి స్తోత్రం || ఆహాహా | |

2.కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం

కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావు

నా రక్షణకర్త స్తోత్రం | | ఆహాహా ||

3.స్తుతులపై ఆసీనుడా స్తోత్రం

సంపూర్ణుడా నీకు స్తోత్రం

మా ప్రార్థనలు ఆలకించువాడా

మా ప్రధాన యాజకుడా స్తోత్రం | | ఆహాహా ||

4.మృత్యుంజయుడా స్తోత్రం

మహాఘనుడా స్తోత్రం

మమ్మును కొనిపోవ త్వరలో రానున్న

మేఘ వాహనుడా స్తోత్రం || ఆహాహా ||

5.ఆమెన్ అనువాడా స్తోత్రం

అల్ఫా ఒమేగా స్తోత్రం

అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా

అత్యున్నతుడా స్తోత్రం ||ఆహాహా ||