అందరు నన్ను విడచినా

నీవు నన్ను విడువనంటివే (2)

నా తల్లియు నీవే

నా తండ్రియు నీవే

నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

|| అందరు నన్ను||


1.లోకము నన్ను విడచినా

నీవు నన్ను విడువనంటివే (2)

నా బంధువు నీవే

నా మిత్రుడ నీవే

నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) | | అందరు

నన్ను||


2.వ్యాధులు నన్ను చుట్టినా

బాధలు నన్ను ముట్టినా (2)

నా కొండయు నీవే

నా కోటయు నీవే

నా కొండ కోట నీవే యేసయ్యా (2)

|| అందరు నన్ను||


3.నేను నిన్ను నమ్ముకొంటిని

నీవు నన్ను విడువనంటివే (2)

నా తోడుయు నీవే

నా నీడయు నీవే

నా తోడు నీడ నీవే యేసయ్యా (2)

| | అందరు నన్ను||